తాము ఎప్పుడూ కూడా పాకిస్తాన్ కి మద్దతు ఇవ్వలేదని.. ఇవ్వబోమని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. తాజాగా రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్ పై ఆయన ప్రసంగించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందని తాము మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు. మాపై నిందలు మోపి మీరు మాత్రం పాక్ నేతలను కౌగిలించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆహ్వానించకుండానే ఆ దేశానికి వెళ్లడం సిగ్గు చేటు అన్నారు. టెర్రరిస్టుల పహల్గామ్ ఎలా చేరుకున్నారు..? ఇది భద్రతా వైఫల్యం కాదా..? అని ప్రశ్నించారు మల్లికార్జున ఖర్గే.
కాంగ్రెస్ ను నిందిస్తూ ఎన్నాళ్లు బతకాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రదాడి ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే కారణం అన్నారు. పహల్గామ్ దాడి తరువాత ఆల్ పార్టీల మీటింగ్ లో ప్రధాని మోడీ ఎందుకు లేరని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యానికి ఎవ్వరూ బాధ్యులు.. పహల్గామ్ దాడి జరుగకుండా కేంద్రం ఎందుకు ఆపలేకపోయింది అని ప్రశ్నించారు. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయా..? అని ప్రశ్నించారు.