ఆపరేషన్ సిందూర్ పై ఇవాళ లోక్ సభలో చర్చ కొనసాగుతోంది. హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. ఆపరేషన్ మహాదేవ్ లో పహల్గామ్ నిందితులను సైన్యం హతమార్చిందని అమిత్ షా స్పష్టం చేశారు. హతమైన ఉగ్రవాదులకు సంబంధించి ఆధారాలకు సభకు తెలిపారు. ఈ అంశం పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్ లో కొన్ని ప్రశ్నలు సంధించారు. జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పహల్గామ్ సంఘటనను నిఘా వైఫల్యం అని స్పష్టం చేశారన్నారు. దానికి తాను బాధ్యత వహిస్తామని మనోజ్ సిన్హా అన్నట్టు తెలిపారు.
వాస్తవానికి నిఘా హోంమంత్రి ఆధీనంలోకి వస్తుంది. హోంమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని తెలిపారు. హోంమంత్రిని కాపాడటానికి లెప్టినెంట్ గవర్నర్ తాను బాధ్యత వహిస్తాడని అన్నారా..? లేక హోంమంత్రి ఆయనతో ఇలా చెప్పించారా..? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో పహల్గామ్ లో 5 సార్లు దాడులు జరిగాయి. ఈ అంశం పై బీజేపీ గుణపాఠం పై నేర్చుకోలేదు.