ఫ్రిజ్ లో మనం అనేక రకాల ఆహార పదార్థాలని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఫ్రిజ్ ని ఎప్పుడు కూడా క్లీన్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలామంది ఎదుర్కునే సమస్య ఏంటంటే ఐస్ ఫ్రిజ్లో గడ్డకట్టుకుపోవడం. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ తరచూ కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. డీప్ ఫ్రీజర్ ని ఎన్ని సార్లు క్లీన్ చేసినా కూడా ఐస్ తో నిండిపోతుంది. దీనికి కారణం ఏంటో మీకు తెలుసా..? ఫ్రిడ్జ్ తలుపు లేదా రబ్బర్ పట్టి దెబ్బతిన్నట్లయితే ఈ సమస్య వస్తుంది. ఇవి పాడైతే గాలి లోపలికి వెళ్లి ఈ విధంగా గడ్డకట్టుకుపోతుంది. కాబట్టి తలుపు లేదా రబ్బర్ పట్టి నీళ్లు కారడం లేదా విరిగిపోయినట్లు అనిపిస్తే కొత్తదానిని మీరు ఫిక్స్ చేయండి.
నీటిని బయటకు పంపడానికి ఒక సిస్టం అనేది ఉంటుంది. కాయిల్ దెబ్బ తిన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. ఫ్రిజ్లోని అదనపు నీటిని బయటకు పంపించడానికి కాయిల్ బాధ్యత వహిస్తుంది. దీనిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. నీటిని క్లీన్ చేసే ఫిల్టర్ విచ్చిన్నం అయితే ఐస్ ఏర్పడుతుంది.
మీరు ఫ్రిజ్లో ఉంచినవన్నీ కూడా ఐస్ తో నిండిపోతాయి. వాటర్ ఫిల్టర్ ని మార్చడమే ఇందుకు పరిష్కారమని గుర్తుపెట్టుకోండి ఫ్రిజ్ ఎక్కువ కాలం పని చేయకపోయినట్లయితే కనీసం ఏడాదికి ఒక్కసారైనా రిపేర్ చేయించండి. అప్పుడు ఇలాంటి సమస్యలు ఏమి రావు వారానికి ఒకసారి లేదా నెలకు రెండు సార్లు శుభ్రం చేసే అలవాటుని కూడా పాటించండి ఇలా చేస్తే సమస్య రాదు.