మనిషికి సంబంధించిన ఆధారాల్లో వేలి ముద్రలు చాలా ముఖ్యమైనవి. ఎంతటి విద్యావంతులైన ఓ సారి వేలి ముద్రలు వేయాల్సిందే. సంతకాలు ఫోర్జరీ చేయవచ్చు. కాని వేలి ముద్రలను మాత్రం ఎవరూ ఫోర్జరీ చేయలేరు. ప్రపంచంలో ఒక్కరి వేలి ముద్రలు మరోకరికి మ్యాచ్ కావు.
ఈ రోజుల్లో వేలి ముద్రల ప్రాముఖ్యత ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పడు ప్రతీదానికీ వేలి ముద్ర వెయ్యాల్సిందే.. సిమ్ కార్డు దగ్గరి నుండి రేషన్ వరకు ప్రభుత్వ పథకాలకు వేలి ముద్రలు తప్పనిసరి. అంతెందుకు ఆఫీస్‌కి లాగిన్ కావాలన్నా వేలిముద్ర వెయ్యాల్సిందే కదా.. ఎలాంటి క్రైమ్ కేసులైను చేధించాలన్నా వేలి ముద్రల పరిశీలనతోనే మొదలవుతుంది. ఎందుకంటే ఒకరి వేలి ముద్రలు ఇంకొకరి వేలి ముద్రలతో మ్యాచ్ కాకపోవడమే. ఈ గీతలను డెర్మటాగ్లిఫ్స్ అంటారు. వేలి ముద్రలు లేకుండా ఉన్నవారిని ఎప్పుడైనా చూశారా..? కనీసం విన్నారా..? అయితే ఆపు అండ్ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..
బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి పట్టణానికి చెందిన ఆపు సర్కార్ కుటుంబం లోని పురుషులకు నాలుగు తరాల నుంచి అసలే వేలి ముద్రలే లేవు. వారి తాత ముత్తాతలు వ్యవసాయంలో వాడే వివిధ రకాల రసాయనాలు వాడటంతో వారి వేలిముద్రలు చేరిగిపోయాయి. రెండు తరాల వారికి అలాగే చెరిగిపోగా ఆ తర్వాత వంశపారంగా వారికి వేలిముద్రలే లేకుండానే జన్మిస్తున్నారు.ఇంకా ఆ కుటుంబంలోని 16 మందికి డీఎన్ఏ పరీక్షలు జరిపారు. వారిలో ఏడుగురికి మామూలు చేతివేళ్లు, తొమ్మిది మందికి వేలిముద్రలు లేని వేళ్లు ఉన్నాయి.
జెనెటిక్ మ్యూటేషన్‌తోనే ఇలా జరుగుతోందని దీన్ని అడెర్మటాగ్లిఫియా అంటారని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేలి ముద్రలేని కారణంగా ప్రస్తుత తరం పలు సమస్యలు ఎదుర్కుంటోంది. డ్రైవింగ్ సైలెన్స్, సిమ్‌కార్డుల కోసం వారి ఇంట్లోని మహిళ వేలిముద్రలతో జారీ చేస్తున్నారు.అయితే బ్యాంకులు, పాస్‌పోర్టు మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో వారి ఐరీష్‌ద్వారా ముఖాన్ని స్కాన్ చేసి జారీ చేస్తారు.