మనందరం ట్రైన్ జర్నీ చేసే ఉంటాం.. కానీ రైలు గురించి చాలా విషయాలు మనలో చాలమందికి తెలియదు.. ఎప్పుడూ విండో సీట్ పక్కన కుర్చోని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయడం తప్ప పెద్దగా ఏం పట్టించుకోం.. రైలు ఇంజిన్ బరువు ఎంతుంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా..? మీరు గమనించారో లేదో.. చివరి బోగికి లైట్ ఉండదు. పైగా చివరి బోగీ పైన X అని ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది..?
భారతీయ రైల్వేని ఆసియాలో అతిపెద్ద నెట్‌వర్క్‌గా చెబుతారు. మన దేశంలో 1 లక్షల 15 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 12617 రైళ్లు నడుస్తాయి. రోజూ లక్షల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే రైలు చివరి బోగీపై ఒక క్రాస్ గుర్తు ఉంటుంది. అలాగే ఒక రెడ్ లైట్ ఉంటుంది. వీటికి ప్రత్యేకమైన అర్థం ఉంది. మీరు రైలును చూసినప్పుడల్లా దాని చివరి బోగీలో క్రాస్ (X) గుర్తు ఉంటుంది. ఇది రైలు మొత్తం ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ చేరిందా లేదా అని తెలుపుతుంది. కొన్నిసార్లు బోగిలు విడిపోతాయి. ఇలాంటి సంఘటనలని గుర్తించేందుకు చివరిబోగిపై క్రాస్ గుర్తు వేస్తారు. ఈ బోగి కనిపించకపోతే ఆ మార్గంలో మరో రైలు ప్రయాణించదు. దీనివల్ల ప్రమాదాన్ని నివారించవచ్చు. అంత పెద్ద మీనింగ్ ఉందనమాట..
అలాగే ఆఖరి బోగీలో క్రాస్ కింద లైట్ ఉంటుంది. రాత్రిపూట చీకటి కారణంగా క్రాస్ గుర్తు కనిపించదు. ఈ లైట్ ఏర్పాటు చేయడం వల్ల మనం క్రాస్ గుర్తుని చూస్తాం. దీనిని బర్నింగ్ లైట్ అని పిలుస్తారు. అలాగే చివరి బోగీపై LV అని ఒక బోర్డు ఉంటుంది. LV అంటే చివరి కంపార్ట్‌మెంట్ అని అర్థం. రైలు పూర్తిగా నడుస్తోందని ఏ కోచ్ విడిపోలేదని ఈ LV గుర్తు తెలుపుతుంది. రైలు మొత్తం ఇంజిన్ సహాయంతో నడుస్తుంది. రైలు ఇంజిన్ బరువు సుమారు లక్షా 96 వేల కిలోలు ఉంటుంది. అది మ్యాటర్.