మేనరికం పెళ్లిళ్లు మంచిది కాదా..? సైన్స్ చెప్తున్న విషయాలు చూస్తే షాక్ అవుతారు..!

-

చాలామంది బయట సంబంధాలు ఎందుకు ఇంట్లో వాళ్ళైతే బాగా అర్థం చేసుకుంటారని.. ఇప్పటికి కూడా చాలామంది దగ్గర సంబంధాలను చేసుకుంటారు. చాలా మంది బావ మరదలు లేకపోతే మావయ్యను కజిన్స్ ని పెళ్లి చేసుకోవడం మనం చూస్తాం. అయితే ఇలా చేసుకుంటే చాలా సమస్యలు వస్తాయట. దీనిని కాన్ శాన్ గ్నివిటీ అని అంటారు. అంటే ఏంటంటే..? దగ్గర వాళ్లను పెళ్లి చేసుకోవడం. మన ఇండియాలో చూసుకున్నట్లయితే సుమారు 13.6% ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా 53% ఇటువంటి వివాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి చూస్తున్నాం.

అయితే ఇలా పెళ్లి చేసుకోవడం వలన పుట్టబోయే పిల్లల్లో శారీరక, మానసిక ఇబ్బందులు 30 శాతం ఎక్కువగా ఉంటాయని.. ఇలా పెళ్లి చేసుకున్నాక పుట్టిన పిల్లల్లో మానసికంగా, శారీరకంగా ఎదగడం ఆలస్యంగా ఉంటుందని.. నాడీ సమస్యలు కూడా రావచ్చని అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఎవరైనా ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటే పిల్లలు జన్యు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు.

చిన్న వయసులోనే థలసేమియా తో పాటుగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చట. ఈ తరహా పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ పిల్లలు చిన్నతనంలో చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భస్రావాల ఛాన్స్ కూడా అధికంగా ఉంటాయట. ముస్లిం దేశాల్లో కూడా ఇలాంటి పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయట. పాకిస్తాన్లో 61% పెళ్లిళ్లు బంధువులతో జరుగుతుంది. అలాగే కువైట్లో 54% ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. అమెరికా, రష్యాల్లో మాత్రం 0.1 శాతం మాత్రమే. అందుకే అక్కడ జన్యుపరమైన వ్యాధులు అరుదుగా వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version