దిండు పక్కన వీటిని అస్సలు పెట్టొద్దు.. దరిద్రం పట్టుకుంటుంది..!

-

చాలామంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. వాస్తుని అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అయితే అప్పుడప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా సమస్యలు వస్తాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు తెలియక చేసే పొరపాట్ల వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిద్రపోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దిండు దగ్గర వీటిని పెట్టొద్దు. ఈ తప్పులు చేయడం వలన చికాకు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇలా అనేకం వస్తాయి. నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులని తలకింద కానీ దిండు దగ్గర కానీ ఉంచకూడదు. నిద్రపోయేటప్పుడు డబ్బులని తల దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు.

అలాగే పర్సు వంటి వాటిని కూడా తల దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే ఖర్చులు పెరిగిపోతాయి. పుస్తకాలు, న్యూస్ పేపర్లు, ఫొటోస్ వంటివి కూడా తల దగ్గర నిద్రపోయేటప్పుడు పెట్టుకోకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. తల దగ్గర నిద్రపోయేటప్పుడు వాటర్ బాటిల్ ని పెట్టుకోవడం కూడా మంచిది కాదట. ఇలా చేయడం వలన మనశ్శాంతి తొలగిపోతుంది. బంగారు ఆభరణాలను కూడా తల దగ్గర పెట్టుకోకూడదు.

ఇవి వృత్తిపరమైన సమస్యలను తీసుకువస్తాయి. మందులు, చెప్పులు వంటివి కూడా మంచం చుట్టూ పెట్టుకోవడం లేదా తల దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు. వెండి ఆభరణాలను కూడా మంచం మీద పెట్టకూడదు. తల దగ్గర అస్సలు పెట్టకూడదు. ఇలా చేస్తే దరిద్రం పట్టుకుంటుంది. మొబైల్ ఫోన్లని, ఐపాడ్లను, వాచీ వంటి వాటిని కూడా మీరు తల దగ్గర నిద్రపోయేటప్పుడు పెట్టుకోవద్దు. వీటి వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version