ఫ్రెషర్స్‌కు షాకిచ్చిన విప్రో.. సగం శాలరీకే జాయిన్‌ అవ్వాలట..!! 

-

ఉద్యోగులకు ఇది గడ్డు కాలమే.. తెల్లారి లేస్తూ.. ఎలాంటి షాకింగ్‌ మెయిల్‌ ఉంటుందో అని దిన దిన గండం అన్నట్లు బతుకుతున్నారు. జాబ్‌ మారాలంటే భయం. అదే కంపెనీలో ఉందామంటే. ఒక పక్క నుంచే కోత మొదలైంది.. నెక్స్ట్‌ మనమేనా అని ఇంకో టెన్షన్.. సీనియర్స్‌, ఫ్రషర్స్ అని తేడా లేకుండా లేఆఫ్‌లకు అందరూ బాధితులయ్యారు. తాజాగా విప్రో ఫ్రషర్స్‌కు పెద్ద షాక్‌ ఇచ్చింది.
ఫ్రెషర్లకు ఆఫర్‌ లెటర్‌ వచ్చిందన్న సంతోషమే తప్ప ఎప్పుడు జాబ్‌కి పిలుస్తారో.. అసలు పిలుస్తారో లేదో తెలియట్లేదు. ఇప్పటికే చాలామంది తమ పొజిషన్‌ గురించి అడుగుతూ కంపెనీలకు మెయిల్స్‌ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఫ్రెషర్లను తీసుకునే విషయంలో విప్రో ఒక షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. విప్రో తమ కంపెనీలో జాయిన్‌ అయ్యే ఫ్రెషర్లకు రెండు కేటగిరీలుగా విభజించి ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తోంది. ఎలైట్‌ కేటగిరీలో వాళ్లకు ఏడాదికి రూ.3.5 లక్షల ప్యాకేజీ, టర్బో కేటగిరీ వాళ్లకు ఏడాదికి రూ.6.5 లక్షల ప్యాకేజీ ఆఫ్‌ర్‌ చేస్తోంది. వెలాసిటీ ప్రోగ్రామ్‌ ద్వారా ఎలైట్ కేటగిరీలో ఉన్న వాళ్లు తమ స్కిల్స్‌ పెంచుకుంటే రూ.6.5 లక్షల ప్యాకేజీ అందుకోవచ్చు. ఈ మేరకు చాలామంది ట్రైనింగ్‌ కూడా పూర్తి చేశారు.
తీరా ఇప్పుడు మీ ప్యాకేజీలో సగం తగ్గించుకోవాలని కంపెనీ యాజమాన్యం ఫ్రెషర్లకు మెయిల్స్‌ పంపుతోంది. అలా తగ్గించుకుంటే వెంటనే జాయిన్‌ అవ్వొచ్చని.. లేదు ముందు ప్యాకేజీయే కావలంటే కొంతకాలం వెయిట్‌ చేయమని చెబుతోంది. దీనిపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రూ.6.5 లక్షల ప్యాకేజీ కోసమని తమకు వచ్చిన వేరే ఆఫర్లు వదులుకుని వెయిట్‌ చేస్తుంటే.. తీరా ఇప్పుడు సగం తగ్గించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులు తెగ వైరల్‌ అవుతున్నాయి. దీనిపై పలువురు మండిపడుతున్నారు. ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది.
దీనిపై ది నాస్కెంట్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (NITES) అనే ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భూపేందర్‌ సింగ్‌కు ఓ లేఖ కూడా రాసింది. బోర్డింగ్‌ తేదీ ఇవ్వకపోవడంతో పాటు, ప్యాకేజీ తగ్గించుకోమంటున్నారని అందులో పేర్కొంది..
దాంతో పాటు ‘2021 సెప్టెంబర్‌- 2022 జనవరి మధ్య విప్రో కొంతమందికి ఆఫర్‌ లెటర్లు ఇచ్చింది. వారికి శిక్షణ ఇచ్చేందుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు చెల్లించాలని నిబంధన పెట్టింది… లేకుంటే.. మూడునెలల పాటు ఫ్రీగా ఇంటర్న్‌షిప్‌ చేయాలని చెప్పింది. 2022 ఏప్రిల్‌లో ఇంటర్న్‌షిప్‌ మొదలుపెట్టగా జులైలో ముగిసింది. ఆగస్టులో వారు ఉద్యోగంలో జాయిన్‌ అవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు అవ్వలేదు. కంపెనీ వారి బోర్డింగ్‌ తేదీని వాయిదా వేస్తూనే ఉంది.’ అని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు ఓ నివేదిక తెలిపింది.
ప్రముఖ సంస్థలే ఇలా చేస్తే మిగిలిన కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇంకొంత కాలం ఈ ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఈరోజుల్లో జాబ్‌ చేయడం ఉంటే.. కత్తిమీద సాము లాంటిదే.. ఉద్యోగం ఉంది కదా అని లోన్స్‌ తీసుకునే వాళ్ల పరిస్థితి ఏంటి..? ఒక్క నెల శాలరీ ఆగిపోతే..ఈఎమ్‌ఐల పరిస్థితి ఏంటి.. ఏదో ఒకటి లే అని తక్కువ శాలరీ ఇచ్చే జాబ్‌లో జాయిన్‌ అయిపోతే.. కెరీక్‌కు లాస్.. మళ్లీ అక్కడ నుంచే మొదలుపెట్టాలి..? ఎన్నో సమస్యలతో సతమతమయిపోతున్నారు పాపం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version