అక్కడ స్త్రీ ఎంత మందితోనైనా శృంగారం చేయొచ్చు.. అడ్డు లేదు

ఆధునిక సమాజంగా చెప్పుకుంటున్నా ఇంకా మహిళలకు మన సమాజంలో ద్వితీయ పౌరసత్వమే కనిపిస్తోంది. ఇంటాబయటా ఇంకా మహిళలు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఎంతో కొంత వివక్ష ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్త్రీలు సర్వ స్వతంత్రులు.

అలాంటిదే..చైనాలోని సిజువాన్ ప్రాంతం. ఇది టిబెట్ సరిహద్దుల్లో ఉంది. అక్కడి ప్రజలు ముసోవ్ జాతికి చెందినవారు. వీరి సంఖ్య మొత్తం నలభై వేలమంది. హిమాలయాల పర్వత ప్రాంతంలోని ఈ కొండజాతి సంస్కృతిలో పురుషుడికి పెద్దగా విలువ ఉండదు. అన్నిటా స్త్రీలదే పై చేయి.

వీరి భాషలో తండ్రి, భర్త అనే పదాలే లేవు. స్త్రీలే అన్ని ప్రధాన నిర్ణయాలను తీసు
కుంటారు. పదమూడేళ్లు దాటిన ప్రతి మహిళ తనకు ఎంత మంది ఇష్టమైతే అంత
మంది పురుషులతో రమించవచ్చు. ఎవరికి ఎవరు తండ్రో తెలీదు. ప్రతి మగాడినీ పిల్లలు ‘అంకుల్’ అనే సంబోధిస్తారు. పిల్లల్ని మహిళ లంతా కలిసి పెంచుతారు.

తండ్రి గురించిన చర్చే రాదు. ఇంటిపని, వంటపని, పశువులను చూసుకోవడం, కట్టెలను ఏరుకు రావడంలాంటి అన్ని పనులనూ మహిళలే చేస్తారు. మగవాళ్లు చేయాల్సిన పని మాంసంకోసం జంతువులను చంపడం. ఒకే ఇంట్లో ఆడ, మగ కలిసి జీవించే పద్ధతే అక్కడ లేదు. వ్యక్తిగత పడక గదులు ఉండవు. ఓ మగవాడికి ఓ స్త్రీ మీద కోరిక కలిగితే, దాన్ని ఆమె స్వాగతిస్తేనే ఆమె ఇంటికి వెళతాడు.