CBSE లో ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు

-

పరీక్షల విధానంపై కేంద్ర విద్యాశాఖ CBSE కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రచించాలని ఆదేశించిందట.

ఇదేగనక జరిగితే CBSE సాంప్రదాయ వార్షిక పరీక్ష ఫార్మాట్ నుంచి గణనీయమైన మార్పు జరుగుతుంది. విద్యార్థులకు సబ్జెక్టుల అవగాహన, మంచి ఫలితాలు సాధించడానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని కేంద్రం భావిస్తోంది. ఏడాదికి రెండుసార్లు పరీక్షల విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు సీబీఎస్ఈతోపాటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యామంత్రిత్వశాఖ సమావేశం కానుంది. పరీక్ష నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చిస్తోంది.విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకే ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని ,ఏడాదికి ఒక్కసారే పరీక్ష రాసే అవకాశం ఉంటే ఎక్కడ తప్పుతా మోననే భయం పిల్లల్లో ఉంటోందని.. దాని వలన పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నారని..అందుకే ఈ విధానాన్ని ఎంచుకున్నామని కేంద్ర విద్యాశాఖ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news