మల్కాజిగిరి పార్లమెంట్ : మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జవహర్ నగర్, దమ్మాయిగూడ లో నిర్వహించిన బిజెపి రోడ్ షో లో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇక్కడ గుడిసెల్ని కూల్చేసినప్పుడు ఖబర్దార్ నా కొడకల్లారా.. నా ప్రజల జోలికొస్తే నీ భరతం పడతా అని ఆనాడు చెప్పాను.ఇక్కడ నివసించేది అత్యంత మంది ప్రజలు తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక, కన్నతల్లిని వదిలిపెట్టి, పొట్టచేత పట్టుకుని వచ్చిన ప్రజలు. అలాంటి అడ్డా జవహర్ నగర్ గడ్డ. వీళ్ళ మీదనే బ్రోకర్లు బతుకుతారు.
మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు… 9 తారీకు ప్రమాణస్వీకారం చేస్తా పదో తారీకు నాడు అన్నిటి మీద సంతకం పెడతా అని చెప్పిండు.మరి.. మీకు ఎవరికైనా కొత్త పెన్షన్లు వచ్చాయా…వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా..నా ఆడబిడ్డలకి 2500 రూపాలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా… కళ్యాణ్ లక్ష్మి పేరుతో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు.. ఎవరికైనా వచ్చిందా.చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు, ఆటో డ్రైవర్లకు 12000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఏది ఇవ్వలేదు.
ఇప్పుడు కేసీఆర్ నాకు ఉత్తచిప్ప చేతికి ఇచ్చాడు అంటున్నాడు.నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నా.. కాళీ కుండలు ఉన్నాయా.. లంకె బిందెలు ఉన్నాయా.. నీకు సోయి లేకుండానే తెలియకుండానే హామీలు ఇచ్చావా ?బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది చెల్లని రూపాయి.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతడా.. 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి వస్తేగిస్తే ఇంకో ఐదు సీట్లు పెరిగి 45 సీట్లు వస్తాయి, వాటితో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదు… అక్కడ నుంచి లంకే బిందెలు తెచ్చేది లేదు, మనకు ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదు అని అన్నారు.