దొంగ‌కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మ‌హిళ‌.. వైర‌ల్‌ వీడియో

-

చోరత్వం 64 కళలలో ఒకటి అయినా చట్టరీత్యా దొంగతనం నేరం. అయితే దొంగతనం చేయడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. అది కూడా ఓ ఆర్టే. అది అందరికి వర్క్ ఔట్ కాదు. దానికీ ఎన్నో ప్లాన్లు వేయాలి. ఆ తర్వాతే రంగంలోకి దిగాలి. దొంగతనం చేయడంలో ప‌ర్ఫెక్ట్ ప్లానింగ్ లేక‌పోతే అడ్డంగా బుక్ అవ్వ‌డం ఖాయం. ఆ క్ర‌మంలోనే ఓ దొంగ‌కు ఓ వింత అనుభ‌వం ఎదురైంది. ఈ దొంగ అనుకున్న‌ది ఒక‌టైతే.. జ‌రిగింది మ‌రొక‌టి.

మ‌రి వివ‌రాల్లోకి వెళ్తే.. దొంగతనం చేయాలని ప్లాన్‌ వేసుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. ఈ క్ర‌మంలోనే రోడ్డుమీద ఒంటరిగా వెళుతున్న యువతి కనిపించడంతో తన ప్లాన్‌ అమలు చేయాలని ప్రయత్నించాడు. కానీ ప్లాన్ రివ‌ర్స్ అవ్వ‌డంతో బిక్కమొహం వేశాడు. దొంగ‌కు ఆ మ‌హిళ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వ‌డంతో చివరికి తన సొమ్ము ఎవరైనా ఎత్తుకుపోతే ఎలా వుంటుందో అర్థమయ్యి పరుగందుకున్నాడు.

అయితే కుక్కకాటుకు చెప్పు దెబ్బలా యువతి స్పందించిన తీరు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీంతో నెటిజ‌న్లు ఆమెకు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌న‌ల‌ను ఎవ‌రైనా అడ్డంగిచి మ‌న వ‌స్తువులు చోరీ చేసిన‌ప్పుడు ఏం చేయాలో ? ఎలా స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చో ? ఆద‌ర్శంగా తీసుకోవ‌చ్చు. మ‌రి ఈ ఫ‌న్నీ విడియో ఎలా ఉందో ఓ లుక్కేయండి..

Read more RELATED
Recommended to you

Latest news