ఆదా చేస్తున్న మహిళా మణులు

-

మహిళ మణులు సగానికిపైగా ఆదా చేస్తున్నారు. కరోనా సమయంలో వారి జీవనంపై ఆలోచించడంతో
మహిళలు పొదుపునకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని మ్యాక్స్‌లైఫ్‌ ఇండియా సర్వేలో వెల్లడయింది. అనవసర ఖర్చు బదులు పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, సంపాదనలో 52 శాతాన్ని తమ లక్ష్యాల కోసం కేటాయిస్తున్నారు. కనీస అవసరాల మొత్తం 39 శాతం మించడం లేదు. ఖరీదైన వాటి కోసం వారు చేస్తున్న ఖర్చు కేవలం 9 శాతమని సర్వే స్పష్టం చేసింది. 56 శాతం మంది తమ వృద్ధాప్య జీవన అవసరాలు కోసం పొదుపు చేస్తున్నట్టు చెప్పారు. 64 శాతం మంది పిల్లల విద్య కోసం 40 శాతం మంది వైద్య ం కోసం పొదుపు చేసినట్టు చెప్పారు.

జన్‌దన్‌ ఖాతాల్లో కూడా ఎక్కువ అకౌంట్లు మహిళలే ప్రధాన మంత్రి జన్‌దన్‌
యోజన కింద అకౌంట్లు కలిగివున్న వారిలో 55 శాతం మంది మహిళలేనని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. . ప్రభుత్వ పథకాల్లో మహిళా భాగస్వామ్యానికి సంబంధించి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థికశాఖ ఒక ప్రకటన చేసింది. మహిళల సాధికారితను పెంచే క్రమంలోజన్‌దన్‌
యోజన కీలకమైనదని చెప్పింది. 2018లో ఈ పథకం ప్రయోజనాలను మరింత పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 ఫిబ్రవరి 24వ తేదీ నాటికి జన్‌దన్‌ యోజన కింద అకౌంట్ల సంఖ్య 41.93 కోట్లు ఉండగా అందులో 23.21 కోట్లు మహిళలే ఉన్నారు.
స్టాండ్‌–అప్‌ ఇండియా స్కీమ్‌కు సంబంధించి 81 శాతానికిపైగా అకౌంట్ల విషయంలో రూ.20,749 కోట్లను మహిళలకు మంజూరుచేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. కింది స్థాయి మహిళలు, బలహీన వర్గాల ఆర్థిక సాధికారతకు 2016 ఏప్రిల్‌ 5న ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం బ్యాంక్‌ ద్వారా కింద రూ.10 లక్షల నుంచి కోటి వరకూ రుణం పొందే వెసులుబాటు ఉంది. ప్రత్యేకించి మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చాలన్నది లక్ష్యం.
ముద్రా యోజన ద్వారా మహిళలకు రూ.6.36 లక్షల కోట్లతో
మహిళలే మందున్నారని ఆర్థికశాఖ ప్రకటించింది. వాణిజ్య బ్యాంకులు, ఆర్‌ఆర్‌బీలు, మైక్రో ఫైనాన్స్‌
కంపెనీలు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌
సంస్థలు ఈ రుణాలను మంజూరు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version