ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన వారెన్ బఫెట్ గురించి అందరికీ తెలుసు. ఈయన అత్యంత సాదా సీదాగా ఉంటారు. విలాసాలకు చాలా దూరంగా ఉంటారు. ఇక ఈయన ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు. అయితే అంత ధనికుడైనా ఈయన ఇప్పటి వరకు రూ.1500 విలువ గల ఓ బేసిక్ శాంసంగ్ ఫ్లిప్‌ఫోన్‌ను వాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఫోన్‌ను ఆయన విడిచిపెట్టి మరొక కొత్త ఫోన్‌కు షిఫ్ట్ అయ్యారు.
వారెన్ బఫెట్‌కు నిజానికి స్మార్ట్‌ఫోన్లను వాడడం అంటే ఇష్టం ఉండదు. ఆయన తన కంపెనీ బెర్క్‌షైర్ హాత్‌ఎవేకు చెందిన స్టాక్ వివరాలను తన ఐప్యాడ్‌లో తెలుసుకుంటారు. అందుకని కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్మార్ట్‌ఫోన్ అవసరం లేదని చెప్పి ఆయన సదరు శాంసంగ్ ఫ్లిప్‌ఫోన్‌ను వాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన ఆ ఫోన్‌ను వదిలేసి ఐఫోన్ 11కు మారారు.
వారెన్ బఫెట్ ఇకపై ఐఫోన్ 11ను వాడనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫోన్ మార్పు విషయాన్ని వెల్లడించారు. అయితే ఐఫోన్ 11ను కూడా తాను కేవలం ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసమే వాడుతానని, అంతకు మించి తనకు దాంతో పని ఏమీ ఉండదని ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా.. వారెన్ బఫెట్ నిరాడంబరతను మనం మెచ్చుకోవాల్సిందే కదా..!