రెండు అక్ష‌రాల‌తో ర్యాప్ సాంగ్‌… తెలుగులో సంచ‌ల‌నం

-

ర్యాప్ సాంగ్.. ఇది కొంచెం వింత‌గా.. మ‌రికొంచెం కొత్త‌గా.. మొత్తంగా గ‌మ్మ‌త్తుగా ఉండే పాట‌. ప‌దాల‌ను ప‌లక‌డంలో.. పాడ‌డంలో.. ర్యాప్ సింగ‌ర్స్ స్టైలే వేరు. అందుకే కాబోలు.. ర్యాప్ సాంగ్స్‌కు, ర్యాప్ సింగ‌ర్స్‌కు సొసైటీలో మాంచి క్రేజీ ఉంది. అందులోనూ యూత్ ఫాలోయింగ్ మామూలుగా ఉండ‌దు మ‌రి. తాజాగా.. ఈ ర్యాప్ సాంగ్స్‌లోనే మ‌రో స‌రికొత్త ప్ర‌యోగం చేశాడు మ‌న తెలుగువాడు చాగంటి ప్ర‌ణ‌వ్‌. ఇప్ప‌టివ‌ర‌కు ర్యాప్ చ‌రిత్ర‌లోనే ఎవ‌రూ ట‌చ్ చేయ‌న‌టువంటి అంశాన్ని ప్ర‌ణ‌వ్ ట‌చ్ చేశాడు. ర్యాప్‌కు మ‌రింత అందాన్నితెచ్చిపెట్టాడు.

కేవ‌లం రెండు అక్ష‌రాల‌తో ర్యాప్‌సాంగ్ రాసి, పాడి సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు. మ‌, న అక్ష‌రాల‌తో ఏర్ప‌డిన రెండ‌క్ష‌రాల ప‌దాల‌ను వాడి అద్భుత‌మైన ర్యాప్‌సాంగ్‌ని క్రియేట్ చేశాడు. ఇది ప్ర‌పంచ ర్యాప్ చ‌రిత్ర‌లోనే మొట్ట‌మొద‌టి ప్ర‌యోగ‌మ‌ని ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. నిజానికి.. తెలుగులో చాలా త‌క్కువ‌గా ర్యాప్ సింగ‌ర్స్ ఉన్నారు.

మ‌న తెలుగు పౌరాణికి చ‌ల‌న చిత్రాల్లో ఎన్నో ప‌ద్యాలు ఉన్నాయ‌ని, వాటికే ఫాస్ట్‌బీట్ జోడించి, ర్యాప్‌గా ముందుకు వ‌స్తున్నామ‌ని, ర్యాప్‌సాంగ్స్‌ను కాపాడుతామంటూ ప్ర‌ణ‌వ్ ముందుకు వ‌చ్చాడు. శ్రీ‌శ్రీ‌, డాక్ట‌ర్ సి నారాయ‌ణ‌రెడ్డి(సినారె), సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిని త‌న క‌విత్ర‌యంగా చెప్పుకుంటూ తెలుగు సాహిత్ర చ‌రిత్ర‌లో ర్యాప్‌కు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చేందుకు ముందుకు వెళ్తున్నాడు.ఈ క్ర‌మంలో ఆయ‌న ఎన్నో అద్భుత‌మైన ర్యాప్‌సాంగ్స్ క్రియేట్ చేశాడు.

అయితే.. ప్ర‌ణ‌వ్ చాగంటికి మ‌రో ప్ర‌త్యేక‌మైన పంథా ఉంది. అది సామాజిక స్రృహ‌ను పెంపొందించే దిశ‌గా సాగుతోంది. ప్ర‌తీ ర్యాప్‌సాంగ్‌లోనూ సామాజిక అంశం ఉంటుంది. అందులో వేద‌న‌, ఆవేద‌న దాగి ఉంది. క‌ష్ట‌జీవి చెమ‌ట చుక్క‌ను ముద్దాడే తత్వం ఉంది. స‌మాజంలో జ‌రుగుతున్న అన్యాయాల‌పై, అస‌మాన‌తల‌పై, చెడు పోక‌డ‌పై అక్ష‌రాయుధాన్ని సంధించే గుణ‌ముంది. అమ్మ భార‌మా..? నీది ఏ కులం.. అని ప్ర‌శ్నించినా.. అది ప్ర‌ణ‌వ్‌కే సాధ్య‌మని చెప్పొచ్చు.

ఈ క్ర‌మంలోనే కేవ‌లం రెండు అక్ష‌రాల‌తోనే ర్యాప్‌సాంగ్‌ను సృష్టించి, తానెంత ప్ర‌త్యేక‌మో మ‌రోసారి నిరూపించాడు ప్ర‌ణ‌వ్‌. ఈ పాట‌ను యూట్యూబ్‌లో ఈనెల‌ 10వ తేదీన విడుద‌ల చేశారు. కొన్ని గంట‌ల్లోనే దీనిని వేలాదిమంది వీక్షించారు. అంతేగాకుండా.. ప్ర‌ణ‌వ్ రాసిన ప‌వ‌నిజం, ఐపీఎల్ టీమ్ స‌న్‌రైజ‌ర్స్‌కు రాసిన పాట‌లు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆల్‌దిబెస్ట్ ప్ర‌ణ‌వ్‌..!


Read more RELATED
Recommended to you

Exit mobile version