వయసు పెరిగినా పెద్దగా సంపాదించలేదని బాధపడుతున్నారా.. ఈ విషయాలు మీకోసమే.

-

ఈ రోజుల్లో 25 ఏళ్ళు వచ్చేసరికి లక్ష రూపాయల జీతం తీసుకునే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలానే 35ఏళ్లు దాటినా కూడా కేవలం 30 వేల జీతం కోసం పనిచేసే వాళ్లు ఉన్నారు.

మీ వయసు 35పైగా అయితే.. మీరు మీ జీతం విషయంలో.. మీ కన్నా తక్కువ వయసు వారు ఎక్కువ సంపాదించడం చూసి ఫీల్ అవుతుంటే.. మీకు కొన్ని విషయాలు తెలియాలి.

సంపాదన ఎప్పుడు మొదలవుతుందనేది ఎవరూ చెప్పలేరు:

కొందరికి 20ఏళ్లలో సక్సెస్ వస్తుంది, ఇంకొందరికి 60ఏళ్లలో వస్తుంది. కె ఎఫ్ సీ ని 60ఏళ్లలో స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు కోరుకున్న డబ్బును ఏదో ఒక టైంలో కచ్చితంగా సంపాదిస్తారు. దానికోసం వర్రీ అవ్వకుండా సంపాదన పెంచుకునే మార్గాలను వెతకడంతో పాటు నైపుణ్యాలను పెంచుకోండి.

డబ్బు కన్నా ఆరోగ్యం ముఖ్యం:

ఒక పర్సన్ అమితంగా సంపాదిస్తున్నాడంటే.. అతను ఎక్కువ కష్టపడుతున్నాడని అర్థం. కష్టమనేది ఫిజికల్ గా మాత్రమే కాదు మెంటల్ గా కూడా ఉంటుంది. మీకు అంతటి కష్టం లేనందుకు సంతోషించండి. ఎందుకంటే లైఫ్ లో డబ్బు కన్నా ఆరోగ్యం చాలా ముఖ్యమైనది.

అదృష్టవంతులను వదిలేయండి:

మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ లక్షలు లక్షలు సంపాదించడం లేదు. మీ చుట్టూ పదిమంది ఉంటే వాళ్లలో నలుగురో ఐదుగురో సంపాదిస్తూ ఉంటారు. ఒక్కోసారి డబ్బు సంపాదించాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. వాళ్లకు అది కలిసి వచ్చింది. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు.

అందరికీ అన్నీ ఉండవు:

మీరు తక్కువ సంపాదిస్తున్నారు, కానీ మీకు మంచి ఫ్యామిలీ ఉంది. పిల్లలు అమ్మా, నాన్న భార్యతో మీకు సంబంధం చాలా బాగుంది. కొందరికి కుటుంబం సరిగ్గా ఉండకపోవచ్చు. వాళ్ల కన్నా మీరు చాలా అదృష్టవంతులు.

నేర్చుకోవడం మానకండి:

డబ్బు సంపాదించాలంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి. రోజురోజుకూ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. కాబట్టి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయకండి. డబ్బు ఆటోమేటిగ్గా అదే వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version