దేవుడికి ఈ పువ్వులతో పూజ చేస్తే మహా పాపం..

-

దేవుడికి పూజ చేయడానికి పూలను కచ్చితంగా వాడతాం.. నిండు మనసుతో ఆ దేవుడ్ని ప్రార్థిస్తే.. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేయడం, నైవైద్యం పెట్టడం అంటే చాలా తేలికైన విషయం అనుకుంటారు..కానీ వీటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. తెలిసి తెలియకుండా చేస్తే..పుణ్యం సంగతి దేవుడెరుగు పాపం చుట్టుకుట్టుకుంది.. దేవుడికి కొన్నిపూలను అస్సలు వేయకూడదు.. ఆ పూలతో దేవడ్ని పూజించకూడదట.. అవేంటంటే..

ఈరోజుల్లో చాలామంది ప్లాస్టిక్‌ దండలను గుమ్మాలకు వేలాడదీస్తున్నారు. అలంకరణ ప్రాయంగా ఉంటాయని.. కొంతమంది అవే ప్లాస్టిక్‌ పూల దండలను పూజ గదిలో కూడా ఉంచుతున్నారు. దేవుడికి మాలగా వేస్తుంటారు. మాములు పూలు అయితే ఒకటి రెండు రోజులకు మార్చాల్సి ఉంటుంది కానీ ప్లాస్టిక్‌ పూల దండలు అయితే ప్రతిసారి మార్చాల్సిన పనిలేదు అనుకుంటారు.. కానీ ఇలా దేవుడికి ప్లాస్టిక్‌ పూలను వేయకూడదు.

ఇంట్లో దేవుడి ఫోటోల‌కు కానీ, పెద్ద వారి ఫోటోల‌కు కానీ ప్లాస్టిక్ పూల మాల‌ల‌ను అస్స‌లు వేయ‌కూడ‌దు. ప్లాస్టిక్ పువ్వుల‌ను కూడా పెట్టకూడ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు తాజా పువ్వుల‌ను మాత్ర‌మే పెట్టాలి. ఇలా ప్లాస్టిక్ పువ్వుల‌ను, పూల దండ‌లను వేయ‌డం వ‌ల్ల అరిష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

కాగిత‌పు పువ్వులను కానీ, దండ‌ల‌ను కానీ ఎటువంటి ఫోటోల‌కు వేయ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం చేసిన పూజ‌ల‌కు ఫ‌లితం ఉండ‌దు. మనకు ఫ్రష్‌ పూలను చూస్తే ఆనందం కలుగుతుంది.. అప్పుడే పూలను తాకిన అనుభూతి కలుగుతుంది..ఎంత ప్లాస్టిక్‌ పూలు చూడ్డానికి బాగున్నా.. అవి నాచురల్‌గా ఉండవు.. తాజా పువ్వులు ప్ర‌త్యేక వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వాటిని చూడ‌గానే మ‌న మ‌నసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మ‌న‌కు ఎంతో ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. తాజా పువ్వుల‌ను చూడ‌గానే మ‌నం ఏవిధంగా అయితే సంతోషిస్తామో భ‌గ‌వంతుడు కూడా అలాగే సంతోషిస్తాడ‌ట‌.

రోజూ తాజా పువ్వుల‌ను స‌మ‌ర్పించి పూజ చేయ‌డం వ‌ల్ల మ‌నుషుల‌ల్లో కోపం, క్రూర‌త్వం త‌గ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్లాస్టిక్ పువ్వుల‌ను స‌మ‌ర్పించ‌డం వల్ల ఇలాంటి భావ‌న‌లు మ‌న మ‌న‌సులో క‌ల‌గ‌వు. తాజా పువ్వుల‌ను భ‌గ‌వంతునికి స‌మ‌ర్పించి భ‌గ‌వంతుడి నామ‌స్మ‌ర‌ణ చేయాలి. అప్పుడే మ‌నం చేసిన పూజ‌కు ఫ‌లితం ల‌భిస్తుంది. ఇంట్లో ఉండే ఎలాంటి ఫోటోల‌కైనా స‌రే ప్లాస్టిక్ పువ్వుల‌ను, ప్లాస్టిక్ పూల మాల‌ల‌ను వేయ‌కూడ‌దని.. దీని వ‌ల్ల మ‌న‌కు చెడు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని పండితులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version