డేటింగ్ లో రోజుకొక కొత్త ట్రెండ్ పుట్టుకొస్తుంది. కొత్త తరం యువత కొత్తరకంగా బంధాలను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం టెక్స్ టేషన్షిప్ ట్రెండింగ్ లో ఉంది. టెక్స్ టేషన్షిప్ అంటే ఏమిటి..? దీని మీద యువత మక్కువ చూపించడానికి కారణం ఏమిటి మొదలగు విషయాలు తెలుసుకుందాం.
టెక్స్ టేషన్షిప్ అంటే పేరులో ఉన్నట్లుగానే కేవలం టెక్స్ట్ మెసేజెస్ ద్వారా బంధంలో ఉండటం అన్నమాట. వాట్.. ఇలాంటి బంధం కూడా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. బట్ ఈమధ్య మెల్లమెల్లగా ఇది పాపులర్ అవుతోంది.
ఈ బంధంలో ఉన్న వారు అవతలి వాళ్ళతో కేవలం మెసేజెస్ మాత్రమే చేస్తారు. ఫోన్ కాల్స్, పర్సనల్గా కలవడానికి అసలు ఉండవు.
కేవలం మన ఆలోచనలని అవతలి వాళ్ళతో మెసేజ్ ద్వారా పంచుకోవడం మాత్రమే ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్ని ఉన్నాయి.
అడ్వాంటేజ్ ఏంటంటే..
ఒక్కసారి మనసు బాధగా అనిపించినప్పుడు ఎవరితోనైనా షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. అలాంటి టైంలో టెక్స్ టేషన్షిప్ బాగానే అనిపిస్తుంది.
ఇంకోటి ఏంటంటే.. ఈ బంధంలో అసలు బాధ్యతలే ఉండవు. అవతలి వాళ్ళ ఫేస్ కూడా మీకు తెలియదు కాబట్టి ఎలాంటి తలనొప్పులు ఉండవు.
డిసడ్వాంటేజెస్ ఏంటంటే..
అవతల వాళ్ళు మీకు ఎవరో తెలియదు, మీతో మనుషులే మెసేజ్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా మిషన్ చేస్తుందా అన్నది కూడా మీకు తెలియదు.
ఇంకోటి.. మెసేజెస్ వల్ల టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. అదిగాక మెసేజ్ చేయడం వ్యసనంగా మారిపోయి మీకు ఇతర పనుల మీద ఫోకస్ తగ్గుతుంది.
అలాగే ఈ బంధంలో మీరు బాగా లోతుకు వెళ్ళిపోతే.. అవతలి వాళ్ళు సడన్గా మీ మెసేజ్ కి రెస్పాండ్ అవ్వకపోతే మీ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇలాంటి బంధాలు పైకి బాగానే కనిపించినా
నష్టాన్ని ఎక్కువ కలగజేస్తాయి.