హవాయ్ దీవుల్లో పర్యటించే స్థోమత లేక ఈ యువకుడు ఏం చేశాడో చూడండి..!

-

ఓ యువకుడు ప్రముఖ పర్యాటక ప్రాంతం హవాయ్ దీవుల్లో పర్యటించలేక ఏం చేశాడంటే… నిజంగానే అక్కడ పర్యటించినట్టుగా ఊహాజనితమైన వీడియోను రూపొందించాడు. యానిమేషన్ సాయంతో మనోడు అక్కడికెళ్లి దీవుల్లో విహరించినట్టుగా వీడియోను డెవలప్ చేశాడు.

ఈ వీడియో చూశాక.. పగలబడి మరీ నవ్వుకుంటారు. వామ్మో.. ఇలా కూడా ఆలోచిస్తారా? అని అనుకుంటారు. ఏది ఏమైనా నేటి యువత ఆలోచనా విధానానికి సలామ్ కొట్టాల్సిందే అంటారు. అవును.. ఈ వీడియో చూశాక మీరే నమ్ముతారు. టాలెంట్ ఎవడి సొత్తు కాదు భయ్యా అంటారు.

young man created imaginary video of his hawaii island trip

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ యువకుడు ప్రముఖ పర్యాటక ప్రాంతం హవాయ్ దీవుల్లో పర్యటించలేక ఏం చేశాడంటే… నిజంగానే అక్కడ పర్యటించినట్టుగా ఊహాజనితమైన వీడియోను రూపొందించాడు. యానిమేషన్ సాయంతో మనోడు అక్కడికెళ్లి దీవుల్లో విహరించినట్టుగా వీడియోను డెవలప్ చేశాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. అంతే.. ఇక.. నెటిజన్లు ఊరుకుంటారా? వామ్మో.. ఏం తెలివి నీది.. అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మనోడు ఎయిర్ పోర్ట్ కు రావడం.. విమానం ఎక్కడం… నుంచి విమానం దిగి.. దీవుల్లో ఎంజాయ్ చేయడం వరకు అన్నింటినీ ఊహాజనితంగా సృష్టించాడు. అతడి ట్విట్టర్ అకౌంట్ ప్రకారం.. ఆ యువకుడు యూఎస్ లోని లాస్ ఏంజెల్స్ కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఆ వీడియో ఉన్నది కేవలం 52 సెకన్లే కానీ… ఆ వీడియోను ఈనెల 19న పోస్ట్ చేయగా… లక్షల మంది ఆ వీడియోను చూశారు.

ఆ వీడియోను చూశాక కొందరు ముందుకొచ్చి.. అతడి కోసం హవాయ్ దీవి టికెట్లను తామిస్తామన్నారు. మరికొందరైతే మీ ఇంటర్వ్యూ తీసుకుంటామంటూ.. మీ వివరాలు చెప్పాలంటే అతడికి ట్వీట్ చేశారు. ఒక్కసారిగా ఆ యువకుడు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయాడు. చూశారా? మనోడి చిన్న ఐడియా.. ఎలా జీవితాన్ని మార్చేసిందో.

మీకు కూడా హవాయ్ దీవుల్లో విహరించాలనుందా? ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియో చూసేయండి మరి..

Read more RELATED
Recommended to you

Latest news