మందు, సిగ‌రెట్ అల‌వాటుందా? మీ జీన్సే అలవాట్లను నిర్ణయిస్తాయి.. ఫ్రెండ్స్ ను నిందించకండి

-

టైటిల్ చదివాక కొంచెం గందరగోళానికి గురయి ఉంటారు. కానీ.. ఈ వార్త మొత్తం చదివాక మీకు ఫుల్లు క్లారిటీ వస్తది.

మీకు మద్యం తాగే అలవాటు ఉందా? సిగిరెట్ తాగే అలవాటు కూడా ఉందా? అయితే మీకున్న ఈ చెడు అలవాట్లకు ముందు మీ ఫ్రెండ్స్ ను నిందించడం ఆపేయండి. వాళ్ల వల్ల మీకు ఈ అలవాటు రాలేదు. ఫ్రెండ్స్ దగ్గర ఉండటం వల్ల.. వాళ్లు తాగుతుంటే చూడటం వల్ల… లేదా వాళ్లు బలవంతంగా తాగించడం వల్ల కానీ.. మీకు ఈ అలవాటు రాలేదు. అవును.. దానికి కారణం మీరే. అంటే.. మీకు ఉన్న మద్యం, సిగిరేట్ అలవాటుకు మీరే బాధ్యులు. వందకు వంద శాతం మీరే బాధ్యులు. దానికి ఎవ్వరూ బాధ్యులు కాదు. అర్థమవుతోందా మేం చెప్పేది. దానికి కారణం మీలో ఉన్న జన్యువులు. వాటినే జీన్స్ అంటారు.

ఇదేదో మేం చెబుతున్నది కాదు.. పరిశోధకులు చెబుతున్నారు. వాళ్లు దీనిపై చాలా ఏళ్లుగా పరిశోధన చేసి ఓ అవగాహనకు వచ్చారు.

మీ జీన్సే మీ అలవాట్లను నిర్ణయిస్తాయి..

అవును.. మీరు చదివింది కరెక్టే. ప్రపంచ వ్యాప్తంగా 1.2 మిలియన్(12 లక్షల మంది) ప్రజల జీన్స్ ను రీసెర్చ్ చేసి మరీ దీని గురించి చెబుతున్నారు. వివిధ రకాల ఫ్యామిలీ, వివిధ రకాల వర్గాలు, ఒకరికి మరొకరితో సంబంధం లేని వ్యక్తుల డేటాను అనలైజ్ చేశారు. ఆ రీసెర్చ్ లో ఏం తేలిందంటే… 566 రకాల జన్యు వైవిధ్యాల వల్లనే మద్యం, సిగిరెట్ అలవాటు అవుతోందట.

మద్యం తాగేవాళ్లకు వాళ్లు రోజూ తాగే మద్యాన్ని ఆల్కాహాల్ యూనిట్స్ గా విభజించారు. సిగిరెట్ తాగే వాళ్లను రోజు ఎన్ని సిగిరెట్లు తాగుతారో దాని ఆధారంగా విభజించారు. అయితే.. అందరిలోనూ జన్యు గుర్తులు మాత్రం అందరిలోనూ అలాగే ఉన్నాయట. అంటే.. జన్యువులతో పాటు సమాజంలోని పరిస్థితులు కూడా ఈ అలవాట్లకు కారణమట.

నార్వే హంట్ రీసెర్చ్ సెంటర్ ఏమంటోందంటే…?

నేచర్ జెనెటిక్స్ జర్నల్ లో పబ్లిష్ అయిన రీసెర్చ్ ప్రకారం… మనుషుల్లో ఉండే 566 రకాల జన్యు కారకాలే మనిషిలోని ఆ అలవాట్లకు కారకాలట. రీసెర్చ్ టీమ్ లో పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్ ఏమంటారంటే… సిగిరెట్ తాగడం, మద్యం తాగడం లాంటి అలవాట్లు జీన్స్ ప్రకారం ఎలాగైతే వస్తాయో.. అవే జీన్స్ వల్ల ఆ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయన్నారు. జీన్స్ తో వచ్చే వ్యాదుల్లో ఎక్కువగా ఒబెసిటీ, డయాబెటిస్, ఏడీహెచ్డీ, ఇతర మానసిక వ్యాధులు ఉంటాయన్నారు. ఈ వ్యాధులతో పోల్చితే జన్యువుల వల్ల వచ్చే ఆల్కాహాల్ తాగే ముప్పు చాలా తక్కువట. జీన్స్ వల్ల ఆ వ్యాధులే తొందరగా వచ్చే ప్రమాదం ఉందట.

జీన్స్ మార్కర్స్ వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేది నిజమే అయినప్పటికీ.. కొన్ని రకాల జీన్స్ వల్ల కన్ని రకాల ఆరోగ్య సమస్యలు పోతాయట. ఆరోగ్య సమస్యలను పారద్రోలే అవే జీన్స్ మద్యం, సిగిరెట్ లాంటి అలవాట్లను కలిగిస్తుందట. అది సంగతి. ఇప్పటికైనా అర్థమయిందా? మీకు ఉన్న అలవాట్లకు వేరెవరో కారణం కాదు. మీరే కారణం. మీ శరీరంలోని జన్యువులే కారణం.

Read more RELATED
Recommended to you

Exit mobile version