లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత శశికళ బయోపిక్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

-

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత వర్మ ఏం సినిమా చేస్తాడన్న క్లారిటీ ఇస్తూ సెన్సేషనల్ డైరక్టర్ ఆర్జివి తన నెక్స్ట్ సినిమా శశికళని ఎనౌన్స్ చేశాడు. శశికల బయోపిక్ అని చెబుతున్నా ఇది ఇన్ డైరెక్ట్ గా జయలలిత గురించి చెప్పబోతున్నారని తెలుస్తుంది. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాతో ఆరు నెలలుగా వార్తల్లో నిలుస్తున్న ఆర్జివి ఇప్పుడు శశికళ సినిమాతో వార్తల్లో నిలుస్తున్నాడు.

శశికళ పోస్టర్ లో శశికళ జయలలిత ఉన్న ఫోటో పెట్టారు. శశికళ కింద క్యాప్షన్ గా లవ్ ఈజ్ డేంజరస్ పొలిటికల్ అంటూ పెట్టాడు. సినిమా ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని.. త్వరలోనే మీ ముందుకు వస్తుందని ట్వీట్ చేశాడు వర్మ. దయలేని మనుషులు, జైళ్లకు మన్నార్ గుడి గ్యాంగ్ మధ్య నడిచే కథగా వర్మ పేర్కొన్నాడు. మరి శశికళ అంటూ వర్మ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమాకు సంబందించిన కాస్ట్ అండ్ క్రూ కూడా ఎవరన్నది రివీల్ చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version