నేటి కాలంలో ప్రతి దాంట్లోనూ కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకని ఇంట్లోనే డియోడ్రెంట్స్ మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఈ కెమికల్స్ ఫ్రీగా ఉండే డియోడ్రెంట్స్ ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అంటే దీనిని పూర్తిగా చూసేయండి.
మన భారత దేశంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా దీనితో ఉక్క , చెమటలతో నిండి ఉంటాం. కనుక డియోడ్రెంట్స్ వాడక తప్పదు. చెమట వాసన తగ్గించుకోవడానికి కమర్షియల్ డియోడ్రెంట్స్ కి బదులు ఇంట్లోనే సహజ డియోడ్రెంట్స్ ని తయారు చేసుకోవచ్చు. కెమికల్స్ ఫ్రీ డియోడ్రెంట్స్ కి కావలసిన పదార్థాలు:
కొబ్బరి నూనె – 1/3 కప్
బీస్వాక్స్ – 3 టేబుల్ స్పూన్స్, దీనిని ముందుగా తురుముకోవాలి
షియా బటర్ – 2 టేబుల్ స్పూన్స
కార్న్ స్టార్చ్ – 1/3 కప్
బేకింగ్ సోడా – ఒక టేబుల్ స్పూన్
మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ – 10-15 చుక్కలు (ఏదైనా తీసుకోవచ్చు)
డియోడరెంట్ కంటెయినర్స్
తయారు చేసే పద్ధతి:
ముందుగా మూడు టేబుల్ స్పూన్ల బీస్వాక్స్ ని ఒక డబుల్ బాయిలర్ లో ఉంచండి.ఇప్పుడు దానికి రెండు టేబుల్ స్పూన్ల షియా బటర్ కలపండి.ఆ తరువాత 1/3 కప్ కొబ్బరి నూనె దానిలో మిక్స్ చెయ్యాలి. బీస్వాక్స్, బటర్, కొబ్బరి నూనెని కరగనివ్వండి. పూర్తిగా కరిగి పోయాక వేడి మీద నించి దించేసి అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/3 కప్ కార్న్ స్టార్చ్ కలపండి. ఇప్పుడు అందులో ఎసెన్షియల్ ఆయిల్ ని కూడా వేసికలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సిలికాన్ మోల్డ్స్ లోకో, డియోడరెంట్ స్టిక్స్ లోకో పోయండి. ఇది కూడా చల్లారిన తర్వాత సెటిల్ అవ్వడానికి రెండు గంటలు పడుతుంది. ఫైనల్ గా ఇది రెడీ అయ్యిపోయింది.