ఇటీవల భారత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా అమిత్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డారు. ఐతే ట్విట్టర్ వేదికగా ఆ కానిస్టేబుల్ కుటుంబానికి సంతాపం తెలిపారు అరవింద్ కేజ్రీవాల్. అలాగే మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. గతంలో యాభై రెండేళ్ల డాక్టర్ అసీమ్ గుప్తా కరోనా వైరస్ తో పోరాడి చనిపోవడంతో అతని కుటుంబానికి కూడా రూ.కోటి ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్. కరోనా పై పోరాడేవారు ఎవరైనా కొవిడ్-19 కారణంగా చనిపోతే వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియో ఇస్తానని ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
‘అమిత్ జీ తన ప్రాణాలను పణంగా పెట్టి ఢిల్లీ ప్రజల సంక్షేమం కొరకు ఎంతో సేవ చేశారు. కానీ దురదృష్టవశాత్తు అతను కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. ఢిల్లీ ప్రజలందరి తరపున అతనికి నేను నివాళులు అర్పిస్తున్నాను. అలాగే అతని కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియో ప్రకటిస్తున్నాను’, అని అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.