డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి. 22న స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటామని తెలిపారు. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అబినందిస్తున్నాం. 22న మా కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
బీజేపీ దక్షిణాది పై పగబట్టినట్టు తెలుస్తోంది అన్నారు. అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది పార్టీలకతీతంగా సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం అభినందనీయమన్నారు. 22వ తేదీ వరకు ఒక్కరోజు, ఒక్క నెల కోసం కాదు.. 2025 ఎదుర్కోబోయే సవాళ్లను ఎదుర్కొంటాం. 22 రోజు పాల్గొనే అన్నీ పార్టీల అభిప్రాయాలను తీసుకొని ఒక కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. సౌతిండియా పై భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తోందన్నారు.