కరోనా వైరస్ మహమ్మారి అయ్యి అందర్నీ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ ని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా రెండు నిమిషాల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవడం అలానే తరచు శానిటైజర్ ని ఉపయోగించడం చూస్తూనే ఉన్నాము. కానీ డాక్టర్లు వైద్య నిపుణులు చెప్పిన ఈ శానిటైజర్ ని ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత ఉపయోగించకూడదు. శానిటైజర్ వాడడం వల్ల ఉపయోగాలు కన్నా అనర్ధాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు.
వైరస్ బారిన పడకుండా ఉండటానికి శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఎక్కువ మోతాదులో శానిటైజర్ ని వాడడం వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయి అయితే శానిటైజర్ ని మరీ అధికంగా వాడితే చాలా నష్టాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్ వాడడం వల్ల కలిగే నష్టాలు ఇవే….
ఇంట్లో ఉన్నప్పుడు దీనిని తక్కువగా వాడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అరచేతుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. అంతే కాదు వాస్తవానికి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని రకాల మంచి బ్యాక్టీరియాలు దోహదం చేస్తాయి కానీ అధిక మోతాదులో శానిటైజర్ ని ఉపయోగించడం వల్ల మంచి బ్యాక్టీరియా కూడా నశించిపోతుంది. కాబట్టి శానిటైజర్ ని అవసరమైనంత వరకే వాడాలి.
అతిగా వాడడం కూడా నష్టానికి దారి తీస్తుంది శానిటైజర్ కి మరీ ఎక్కువగా అలవాటు పడితే వైరస్, క్రిములు కూడా తమ రోగ నిరోధకశక్తిని పెంచుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు మన శరీరానికి చేతులకు సహజసిద్ధంగా ఉండే రోగనిరోధక శక్తి స్థాయి తగ్గిపోతుందట. అలానే చేతులు అపరిశుభ్రంగా దుమ్ము పట్టి అంటుకున్నప్పుడు మాత్రమే శానిటైజర్ ని ఉపయోగించమని నిపుణులు అంటున్నారు. అంతే కానీ ప్రతి క్షణం శానిటైజ్ చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు.