నేడు ఎలివేటెడ్ కారిడార్ కి శంకుస్థాపన చేసిన కేటీఆర్..!

-

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ సమస్యను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పురపాలక శాఖ మంత్రి అయిన కేటీఆర్ గురువారం రోజు అనగా నేడు చంచల్‌గుడలోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుండి యాదగిరి థియేటర్ వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎలివేటెడ్ కారిడార్ చంచల్‌గుడ జంక్షన్, సైదాబాద్ జంక్షన్, ధోబిఘాట్ జంక్షన్, ఐఎస్ సదన్ జంక్షన్ మీదుగా వెళుతుందని జిహెచ్‌ఎంసి కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ తెలిపారు.

ఎస్ఆర్డిపీ కింద రూ.523 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణానికి జిహెచ్ఎంసి శ్రీకారం చుట్టింది. ఇరవై నాలుగు నెలల్లో పూర్తి కానున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ పొడ‌వు 3.382 కిలోమీట‌ర్లు కాగా… అందులో ఫ్లైఓవ‌ర్ పొడ‌వు 2.580 కిలోమీట‌ర్లు. ఐతే రెండు వైపులా ర్యాంప్ నిర్మాణం కూడా చేయనున్నారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే నల్గొండ క్రాస్ రోడ్డు నుండి ఓవైసి ఆసుపత్రి జంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. వీటితో పాటు పలుజంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారం అవుతుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version