ఈ విషయాల్లో తల్లిదండ్రులు ఫెయిల్ అవ్వకూడదు..!

-

తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచాలి. మంచి రూట్స్ ఉంటే పిల్లలు చక్కటి రూట్ లో వెళ్తారు. లేదంటే పిల్లలు పక్క దారిన పోయే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు తప్పొప్పులని గమనించి మంచినే నేర్పాలి. ఇలా కనుక తల్లిదండ్రులు శ్రద్ద వహిస్తే చాల మంచిది. మీరు కూడా మీ పిల్లలకి మంచి అలవాట్లని, మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటే ఈ విషయాల్లో మీరు ఫెయిల్ అవ్వకూడదు. అవేమిటో ఇప్పుడే చూడండి.. వివరాల్లోకి వెళితే..

పిల్లలు ఎంత వరకు నేర్చుకున్నారో చూడాలి. అంతే కానీ మార్కుల కోసం ఒత్తిడి చేయకూడదు. అలానే వాళ్ళు ఆన్‌లైన్‌ క్లాసులకి ఎటెండ్ అయినప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఇలా చూస్తూ ఏమైనా సందేహాలు ఉన్న ఇబ్బందులు ఉన్న క్లియర్ చేస్తూ ఉండాలి. వాళ్ళల్లో మానసిక ఒత్తిడి తగ్గడానికి ఏదైనా కల్చరల్ ఆక్టివిటీస్ ని నేర్పించాలి. వీటి వల్ల స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. పోటీ తత్వం కూడా పెరుగుతుంది.

పిల్లలు తాము తెలుసుకున్న విషయాలను ఎదుటి వాళ్లకు తెలియ జేయాలని అనుకుంటారు. తల్లిదండ్రులు రోజుకో పది నిమిషాలు కేటాయించి… విద్యార్థులుగా మారి పిల్లల్ని టీచర్లను చేయాలి. అలా వాళ్ళని మాట్లాడనిస్తూ నిశబ్దంగా వినాలి. ఇలా చేస్తే పిల్లల్లో కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. అలానే తల్లిదండ్రులు వాళ్ళ తో కూడా మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల పేరెంట్స్‌ ఎంత ఎక్కువగా మాట్లాడితే పిల్లలు అంత ఓపెన్‌ అవుతారు. అంతే కాదు బయట షాపింగ్‌కు, పార్క్ ‌కి తీసుకెళ్లినప్పుడు వాళ్ల తో టైం స్పెండ్ చేయాలి. ఇలా తల్లిదండ్రులు పిల్లల తో ఉంటె వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. కనుక తలిదండ్రులు వాళ్ల పనుల తో ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం కాస్త సమయాన్ని వెచ్చించడం చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news