మీ భాగస్వామి గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

-

భాగస్వామి మనసు తెలుసుకోవడం చాలా కష్టం అనే చెప్పాలి..ఒక సంబంధాన్ని కలిగి ఉంటే అవతలి వ్యక్తి ఎప్పుడూ ఎలా ఉంటాడో చెప్పడం కష్టమే..సంబంధంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఇద్దరం సంతోషంగానే ఉన్నాం..కానీ అలా అనుకోవడం తప్పు..

ఒకరు మనసులో ఏమనుకుంటున్నారో కరెక్టుగా అంచనా వేయడం చాలా కష్టం. కానీ వారు చేసే కొన్ని పనులు వాళ్లు మనసులో ఏమనుకుంటున్నారో చెప్పకనే చెబుతాయి. వాటి ద్వారా భాగస్వామి మనసులో ఏమనుకుంటున్నారో అంచనా వేయొచ్చు.సంబంధంలో ఒకరు హ్యాపీగా ఉన్నారా, లేదా అసంతృప్తితో ఉన్నారా అనేది తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటి ద్వారా మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో మాత్రం సులువుగా తెలుసుకోవచ్చు..

అలాగే ప్రతి ఒక్కరూ స్నేహితులతో సమయాన్ని గడుపుతుంటారు. ఇందులో ఫ్రెండ్స్తో గడిపే సమయం ఉన్నట్టుండి పెరిగితే మాత్రం ఏదో సమస్య ఉందని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.దంపతుల్లో ఎవరైనా ఇలా భాగస్వామితో సమయం గడపకుండా ఫ్రెండ్స్తో ఎక్కువ సమయం గడుపుతుంటే వారి భాగస్వామితో దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంకేతం మీకు కనిపించగానే పార్ట్నర్తో కాసేపు సమయం గడిపి అసలు సమస్య ఏమిటో వారినే అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం ముఖ్యం.. అప్పుడే ఆ బంధం బలపడుతుంది..

సంబంధంలోని సమస్యలపై పని చేయడానికి ఎవరైనా ఇష్టపడకపోతే, మీరు వారితో విడిపోవడానికి ఇది ఒక సంకేతంగా చూడవచ్చు. సంబంధం అనేది రెండు వ్యక్తులపై ఆధారపడి ముందుకు సాగుతుంది. ఒకరు సమస్యతో బాధపడుతుంటే మరొకరు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఇద్దరూ కలిసి ఉన్న ఆ బంధం ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. బంధం కూడా అలాంటిదే. భాగస్వామికి సాయం చేయని వ్యక్తులు  ఎప్పుడూ బంధాన్ని వదిలెద్దామా అని ఆలోచిస్తారని స్పష్టం అవుతుంది..

శృంగారం మరీ ఎక్కువైనా ఏదో సమస్య ఉన్నట్లేనని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే శృంగారం ద్వారా దంపతుల మధ్య చాలా సమస్యలు తీరతాయని తెలిసిందే. ఇదే మీ భాగస్వామి ఆలోచిస్తూ దాంపత్యంలో శృంగారాన్ని ఎక్కువ చేసి ఉండొచ్చు. కాబట్టి లైంగిక జీవితంలో మార్పును గమనించినట్లయితే ఆ సమస్య గురించి మాట్లాడటం బెస్ట్.. ఇదంతా కాదు మీ పై చిరాకు, కోపంగా వుంటే మాత్రం మీకు దురంగా వెల్లాలని అనుకుంటున్నారని అర్థం..ఇవి గ్రహిస్తె వారితో వెంటనే వెళ్ళి మాట్లాడి సరి చేసుకోవడం బెస్ట్..గుర్తుంచుకోండి…

Read more RELATED
Recommended to you

Exit mobile version