తెలంగాణ ఎన్నికల సంఘం తాజాగా ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. అధికారిక సమాచారం ప్రకారం జూన్ 23వ తేదీ నుండి ఇంటింటికీ BLO ల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఇప్పటికే లిస్ట్ లో ఉన్న ఓటర్లు ఉన్నారా లేదా అని చెక్ చేసుకుని కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకునే వారు ఎవరైనా ఉంటే నమోదు చేయనున్నారు. ఇలా చేసిన తర్వాత ఆగష్టు 2వ తేదీన దీనిని బహిరంగంగా పబ్లిష్ చేసి ఈ లిస్ట్ లో ఇంకా ఎవరైనా ఓట్లు నమోదు కాకుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవాలి.
ఎన్నికల సంఘం: యువతా… మీకు 18 సంవత్సరాలు నిండాయా ?
-