ఏపీ పోలీసులు డబ్బు పంపిణీ చేయలేదు..తెలంగాణ డీజీపీ

-

ఇటీవల జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఏపీ పోలీసులు డబ్బు పంచుతున్నట్లు తెరాస నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు టిఆర్‌ఎస్‌ పార్టీ ఫిర్యాదుపై సమగ్ర విచార ణ జరిపిన డీజీపీ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌కు నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  ధర్మపురి పట్టణంలో ముగ్గురు వ్యక్తులపై అనుమానంతో  తెరాస నేత శ్రీకాంత్‌ రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఏపీ  ఇంటెలిజెన్సు పోలీసులు యు.నారా యణ రెడ్డి, బి.వెంకటేశ్వరరావు, బి.మధుకర్‌ బాబుగా గుర్తించామని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. విచారణలో ఎన్నికల సర్వే కోసం అక్కడికి వచ్చినట్లు చెప్పారని నివేదికలో తెలిపారు. ఏపీ పోలీసుల నుంచి ఎలాంటి నగదు స్వాధీనం  చేసుకోలేదని ఆసమయంలో వారివద్ద డబ్బు లేదని, కేవలం సెల్‌ ఫోన్లను మాత్రమే ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ధర్మపురి తెదేపా  ఇన్‌చార్జి జడి బాల్‌రెడ్డి తితిదే సత్రంలో ఏపీ పోలీసులకు వసతి సౌకర్యం కల్పించడంతో వారు ఆయా ప్రాంతాల్లో తిరిగారని ఈసీకి అందజేసిన నివేదికలో తెలంగాణ డీజీపీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news