ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా ఎదిగిన ఓ హీరో లాస్ట్ ఇయర్ వరకు వరుసగా ఆరు హిట్లు అందుకోగా ఈ ఇయర్ వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అందుకున్నాడు. అందులో ఒకటి మల్టీస్టారర్ మూవీ. సీనియర్ స్టార్ తో మల్టీస్టారర్ సినిమా చేసిన అతను ఆ సినిమా చేశాక తెలిసింది ఎందుకు ఆ సినిమా చేశామని. సినిమా మధ్యలోనే రిజల్ట్ కనిపెట్టేసిన సదరు హీరో చేసేదేం లేక సైలెంట్ గా ఉన్నాడు.
ప్రస్తుతం ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్న ఆ హీరో దగ్గరకు ఓ దర్శకుడు మల్టీస్టారర్ కథ తీసుకెళ్లాడట. మల్టీస్టారర్ అంటే డోర్ అవతలే ఆగు అన్నట్టుగా ప్రవతించాడట సదరు హీరో. కథగా ఎంత బాగున్నా మల్టీస్టారర్ సినిమా అంటే రాసుకున్నంత బాగా రావని అతని నమ్మకం. అందుకే వచ్చిన దర్శకుడికి కాఫీ తాగమని కథ కూడా వినకుండా పంపించాడట. ఇక లైఫ్ లో మల్టీస్టారర్ తీయనని సన్నిహితులతో చెప్పాడట. మరి ఈ హీరోని ఇంతగా ప్రభావితం చేసిన అనుభూతులు ఏంటో అతను చెబితేనే భయపడుతుంది.