ఓటీటీలోకి రానున్న సైంధవ్… రిలీజ్ ఎప్పుడంటే….

-

హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ నటించిన తాజా చిత్రం సైంధవ్‌ . ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కింది.వెంకటేష్‌ నటించిన 75వ చిత్రనికి వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ హంగులతో నిర్మించారు. ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, హిందీ మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రం ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 15 కోట్లకు ఈ చిత్రం ఓటిటీ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం.వచ్చే నెల మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 9 న అమెజాన్ ప్రైమ్‌లో సైంధవ్  మూవీ శ్రీని కాబోతుందని తెలుస్తుంది.ఇదే సైంధవ్ ఓటీటీ విడుదల తేదీ అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version