కాంగ్రెస్ కంచుకోటపై గులాబీ దళాధిపతి టార్గెట్

-

తెలంగాణలో ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఇప్పటికీ బలంగానే ఉంది. దీంతో తెరాస అధినేత సీఎం కేసీఆర్ ఈ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నల్గొండ జిల్లా మర్రిగూడలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో కాంగ్రెస్ ముఖ్యనేలతపై తనదైన శైలిలో విరుచుకుపడనున్నారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మహా కూటమిపై వాడి వేడి విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌‌గా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా? అంటూ కాంగ్రెస్ పార్టీపై ఆయన దుమ్మెత్తిపోశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఈ నేపథ్యంలో

మళ్లీ తెలంగాణ ఆంధ్రోళ్ల చేతుల్లోకి వెళ్తోందనే విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లడమే కేసీఆర్ వ్యూహంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే. దీంతో వీరిపై కూడా కేసీఆర్ ఘాటైన విమర్శలు చేసే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ ఈ రోజు ఏం మాట్లాడతారో అనే విషయంపై కోసం అటు ప్రభుత్వంలోని పెద్దలు, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version