ఉత్తరాంధ్రలో తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్ర ప్రభుత్వం రూ.229 కోట్ల నిధులను రాష్ట్ర విపత్తు సహాయ నిధికి కేంద్రం విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా నిధులను ఖర్చు చేసేందుకు కేంద్రం అవకాశమిచ్చింది. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందాలు ఇటీవలే పర్యటించాయి..దీంతో వారు అందించిన నివేదిక ఆధారంగా మరిన్ని నిధుల త్వరలోనే విడుదల చేస్తామని హోంమంత్రిత్వ శాఖ వివరించింది. ఉత్తరాంధ్ర జనజీవనం అతలాకుతలం అయిన సంర్భంగా కేంద్రం నుంచి సాయం కోరుతూ… తక్షణ సాయంగా రూ.1200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.