హీరో నిఖిల్.. ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నాడు. ఇటు సినిమాలే కాదు.. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. సోషల్ సర్వీసు చేస్తుంటాడు. అన్నింట్లో ఉండాలనుకుంటాడు. అదే ఒక్కోసారి మనోడికి సమస్యలను తీసుకొస్తుంటుంది. ఆమధ్య విజయ్ దేవరకొండ విషయంలోనూ వేలు పెట్టాడు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను మనం బాజాప్తా గౌరవించాల్సిందే. కానీ.. ఆయన బతికి ఉంటే.. ఆ విగ్రహానికి పెట్టిన ఖర్చును ఆమోదించేవారా? నాకైతే అర్థం కావట్లేదు..’ అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నిఖిల్‌కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నా.. కొంతమంది మాత్రం నిఖిల్‌పై ఫైరవుతున్నారు. ఎందుకయ్యా రాజకీయాల్లో వేలు పెడతావు. నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా అంటూ హితువు పలుకుతున్నారు. నిఖిల్ ఇటీవలే శ్రీకాకుళాన్ని అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను బాధితులకు తన వంతు సాయంగా కొన్ని సరుకులు, డబ్బు అందించి.. అక్కడ సహాయక చర్యల్లోనూ పాల్గొన్నాడు.
For the Gigantic effort of uniting our Country, Sardar Vallabhbhai Patel deserves to be Recognised in the highest possible way?.
However dont know if He was alive he would approve of the cost of making it ?♂️?#StatueOfUnity #TallestStatueInTheWorld pic.twitter.com/98Al3UMPBG— Nikhil Siddhartha (@actor_Nikhil) October 31, 2018