తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక తెలంగాణ నిర్మాణం : భట్టి

-

2014లో రాష్ట్రం ఏర్పాటు కోసం ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమ పోరాటం ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంను గౌరవించి ఆనాటి ఉద్విగ్నంగా ఉన్న పరిస్థితుల్లో ధైర్యం చేసి ఆనాడు టీఎస్ బిల్లు పాస్ ఆఫ్ చేసి రాష్ట్రాన్ని ప్రకటించిన గణత కాంగ్రెస్ దే నని, తెలంగాన ప్రకటించిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా తెలంగాణ ప్రజానీకం గౌరవించాల్సి ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కార్యకర్తలు నాయకులు మధ్యన పీపుల్స్ మార్చి పాదయాత్ర సందర్భంగా కేక్ కట్ చేశారు. శుక్రవారం నాతికి భట్టి పాదయాత్ర 78వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని బల్మూరు మండలం అనంతపురం కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రజలను ఉద్దేశించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సామాజిక తెలంగాణ నిర్మాణం జరుగుతుందన్నారు.

భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం, స్వాతంత్రం, భావ స్వేచ్ఛను తెచ్చుకోలేక పోయామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, అమ్మ హస్తం వంటి పథకాలు కూడా అందని పరిస్థితి కేసీఆర్ పాలనలో నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి ఆ చట్టాన్ని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దళిత బంధుకు 17వేల 700 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి, ఏడాది పూర్తయినా నిధులు విడుదల చేయలేదు అన్నారు ఆయన.

Read more RELATED
Recommended to you

Exit mobile version