త్వరలోనే కొమురవెల్లిలో కొత్తగా రైల్వే స్టేషన్‌ ఏర్పాటు…

-

మనోహరాబాద్-కొత్తపల్లి మధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే మార్గంలో ఉన్న కొమురవెల్లిలో కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్ నిర్మించి.. భక్తులకోసం ట్రైన్ ఆగేందుకు మార్గం సుగమమైంది. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ అవసరం గురించి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైల్వేశాఖ మంత్రికి పలుమార్లు లేఖలు రాయడంతో రాశారు. కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.లక్డారం-దుద్దెడ స్టేషన్ల మధ్యన కొమురవెల్లిలో కొత్త హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.

 

 

జాతర ప్రారంభానికి ముందుగా మోదీ ప్రభుత్వం కొమురవెల్లి మల్లన్న భక్తులకు కానుకగా ఈ రైల్వేస్టేషన్ అందించింది అని అన్నారు. ఈ సందర్భంగా భక్తుల తరఫున నరేంద్ర మోడీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ప్రతి ఏటా సంక్రాంతి కి జాతర మొదలై ఉగాది వరకు మల్లన్న జాతర వైభవంగా జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news