నాకు హిందీ రాదు అంటున్న కీర్తి సురేష్.. ఆసక్తిక‌రంగా ‘రఘు తాత’ టీజర్

-

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పరిచయం అక్కర్లేని పేరు.నేను శైలజతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అరంగేట్రం చేసి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌ పేరు తెచ్చుకుంది. ఇక గ‌త సంవత్సరం దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం తెలుగు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చేసి వరుసగా తమిళ చిత్రాలు చేస్తూ ఉంది. ఇప్ప‌టికే జయం ర‌వితో సైరెన్ సినిమా చేస్తున్న తాజాగా ‘రఘు తాతా’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది .ఈ మూవీకి సుమన్‌కుమార్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో క్యాడెట్ శిక్షణ పొందుతున్న కీర్తి సురేష్ కి NCC మాస్ట‌ర్ హిందీలో శిక్ష‌ణ ఇస్తుంటాడు. అప్పుడు నాకు హిందీ రాదు త‌మిళంలో చెప్పండి సార్ అంటూ కీర్తి సురేష్ చెబుతుంది. దీంతో ఈ సినిమా తమిళ ప్రజలపై హిందీని రుద్దడం చుట్టూ తిరుగుతున్న‌ట్లు కనిపిస్తుంది. ఒక సీన్లో హిందీ పరీక్ష రాస్తేనే ఉద్యోగంలో ప్రమోషన్ వ‌స్తుంది అంటే దానిని కీర్తి సురేష్ వద్దని చెబుతుంది.‘సలార్’ తో సూపర్ హిట్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తుండగా.. ఎంఎస్ భాస్కర్,దేవదర్శిని, రవీంద్ర విజయ్, రాజీవ్ తదితరులు కీలక పాత్ర‌లలి నటిస్తున్నారు. షాన్ రోల్డన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news