Telangana : దళితబంధు లబ్ధిదారులకు షాక్.. అకౌంట్లు ఫ్రీజ్

-

Telangana : తెలంగాణ దళితబంధు లబ్ధిదారులకు షాక్ తగిలింది. దళితబంధు లబ్ధిదారుల అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయాయి. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

Shock for Dalit Bandhu beneficiaries

ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో అకౌంట్లలో ఉన్న రూ. 436.27 కోట్లను 33 జిల్లాల్లోని 11,108 మంది లబ్ధిదారులు విత్ డ్రా చేసుకోలేని స్థితిలో ఉన్నారు. నియోజకవర్గానికి 1100 మంది చొప్పున 1.31 లక్షల మందిని గత ప్రభుత్వం ఎంపిక చేయగా…. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అమలుపై సందిగ్ధం నెలకొంది.

కాగా, సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 10 రోజులు తెలంగాణ రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన…. ఇవాళ పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతారు. రేపు మణిపూర్ లో రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొంటారు. తర్వాత ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ కు పయనం అవుతారు. ఈ నెల 15-18 వరకు దావోస్ సదస్సులో పాల్గొంటారు. తర్వాత మరో మూడు రోజులు లండన్ లో పర్యటించి 23వ తేదీన హైదరాబాద్ తిరిగివస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news