ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన 12 th ఫెయిల్ సినిమా

-

విధు వినోద్ చోప్రా డైరెక్షన్‌లో విక్రాంత్ మస్సే నటించిన తాజా చిత్రం’12th ఫెయిల్’. ప్రముఖ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటుంది. 2019లో 12th ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ శర్మ ఎన్నో కష్టాలుపడి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు అని అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.

 

అయితే సెన్సేషన్ క్రియేట్ చేసిన ’12th ఫెయిల్’ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది.ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ విభాగంలో విక్రాంత్ , ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్ చోప్రా ఎంపిక అయ్యారు. అంతేకాకుండా ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ చిత్రం కేటగిరీల్లో కూడా ఎంపికైంది. వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తప్పక చూడాల్సిన చిత్రాల్లో ఒకటని సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version