బాలాపూర్ లడ్డు @16.60 లక్షలు

-

బాలాపూర్ లఢ్డు ప్రతీ ఏటా మాదిరిగానే అత్యధిక ధర పలికింది. ఈ ఏడాది 16.60 లక్షలకు ఆర్యవైశ్య సంఘం నేత శ్రీనివాస్ గుప్తా లడ్డును వేలంలో దక్కించుకున్నారు. గతేడాది కంటే లక్ష రూపాయల అధికంగా ఈ లడ్డు ధర పలికింది. లడ్డుని వేలంలో పాడుకున్న వారికి అంతా శుభం జరుగుతుందనే నమ్మకం ఉంది. దీంతో ప్రతీ వినాయక మండపాల్లోని లడ్డులను వేలం వేస్తుంటారు.

ఎన్నికల ఏడాది కావాడంతో లడ్డు వేలం మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్‌ గణపయ్యకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ లడ్డూ దక్కించుకునేందుకు పోటీ పెద్ద ఎత్తున ఉంటుందనే సంగతి తెలిసిందే. దీనిని దక్కించుకోవడానికి పలు రంగాలకు చెందిన ప్రముఖలు ఈ వేలం పాటలో పాల్గొంటారు. 1994 నుంచి బాలాపూర్  లడ్డూ వేలంపాట మొదలైంది. 1994లో రూ.450 పలికిన తొలి లడ్డూ… 2017లో రూ.15.60 లక్షలకు చేరుకుని ఈ ఏడాది 16.60 వేలకు చేరింది.

లడ్డు ప్రత్యేకత

21 కిలోల లడ్డుని గత నాలుగేళ్లుగా తాపేశ్వరంలోని హనీ ఫుడ్స్‌ లడ్డూను తయారు చేస్తోంది. వేలంపాట విజేతకు లడ్డూను ఉంచే రెండు కిలోల వెండి గిన్నెను ఇస్తున్నట్లు హనీ ఫుడ్స్‌ అధినేత ఉమామహేశ్వర్‌ తెలిపారు. బాలాపూర్‌ లడ్డూను తొలుత చార్మినార్‌లోని గుల్‌జల్‌ ఆగ్రా స్వీట్‌ హౌస్‌ వారు తయారు చేసేవారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version