బై బై బాబుకు ధీటుగా టీడీపీ నినాదం..సక్సెస్ అవుతుందా?

-

గత ఎన్నికల్లో చంద్రబాబుని గద్దె దించడానికి వైసీపీ వేయని ఎత్తు లేదు..చేయని రాజకీయం లేదు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి టీడీపీని పూర్తిగా నెగిటివ్ చేశారు. అదే సమయంలో బై బై బాబు అనే నినాదంతో ఎన్నికల్లో హల్చల్ చేశారు. దీంతో నిజంగానే ప్రజలు బాబుకు బై చెప్పేశారు. జగన్‌ని గెలిపించుకున్నారు.

ఇక జగన్ అధికారంలోకి వచ్చాక..ప్రజలు హ్యాపీగా లేరని, ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఇష్టారాజ్యంగా అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారని వైసీపీపై టీడీపీ ఫైర్ అవుతుంది. అందుకే ప్రజలపై పన్నుల భారానికి తగ్గట్టుగా బాదుడేబాదుడు కార్యక్రమం పెట్టారు. అటు జగన్ పాలన వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం ద్వారా..జగన్ పాలన వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకు టీడీపీ నేతలు వివరించే కార్యక్రమం చేస్తున్నారు. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌ని గద్దె దించి..టీడీపీ అధికారంలోకి రావాలని చూస్తుంది.

ఈ క్రమంలోనే చంద్రబాబు జిల్లాల టూర్లకు వెళుతున్నారు. ఇక బాబు టూర్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరులో బాబు టూర్ నడిచింది. అక్కడ బాబుకు భారీ ఎత్తున ప్రజల మద్ధతు వచ్చింది. దీంతో బాబు తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇదే క్రమంలో బాబు కొత్త స్లోగన్ తో ముందుకొచ్చారు. సైకో పాలన పోవాలి..సైకిల్ పాలన రావాలి అని చెప్పి నినాదం అందుకున్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ బై బై బాబు అనే నినాదంతో సక్సెస్ అయింది..ఇప్పుడు బాబు..సైకో పోవాలి..సైకిల్ రావాలి అనే నినాదం అందుకున్నారు. దీని ద్వారా జగన్ అంటే ప్రజల్లో నెగిటివ్ రావాలనే విధంగా ప్రచారం చేస్తున్నారు. మరి బాబు నినాదం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version