మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజె అక్బర్ సోమవారం పరువునష్టం దావా వేశారు. తనను లైంగికంగా వేదించానంటూ అసత్య ఆరోపణలు చేసిన ఆమెను విచారణ జరపాలని అక్బర్ తన పిటిషన్లో కోరారు. ఈ సందర్భంగా పాటియాల హౌస్ కోర్టులలోని చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ సుమిత్ దాస్ కోర్టులోక్రిమినల్ పరువునష్టం దావా దాఖలు చేశారు. మీటూ ఉద్యమంలో భాగంగా ఎంజె అక్బర్ ఎడిటర్ గా ఉన్న సమయంలో తనతో అసభ్యకరంగా అనుసరించేవాడని పేర్కొంటూ సామాజిక మధ్యమాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని కోరుతూ అక్బర్ ప్రియా రమణిపై సవాల్ విసిరారు.
మీటూ పై కఠినంగా స్పందించిన కేంద్ర మంత్రి
-
Previous article
Next article