తిత్లీ బాధితుల‌కు వైసీపీ కోటి రూపాయ‌ల విరాళం

-

ysrcp donates rs1 crore cyclone titli relief fund
తిత్లీ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. తుపాన్‌ ప్రాంతాల్లో కూడా చంద్రబాబు హెరిటేజ్‌ వ్యాపారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. చంద్రబాబు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా.. ఆయన మనసంతా సీఎం రమేష్, సుజనా చౌదరిలపై జరుగుతున్న ఐటీ దాడుల గురించే ఆలోచిస్తుందన్నారు. తుఫాను బాధితులను ఆదుకునేందుకు వైసీపీ తరపున కమిటీని నియమించినట్లు ఎమ్మెల్యే పిన్నెల్లి తెలిపారు.

దేశంలో టెక్నాల‌జిని శాసించే స్థాయిలో ఏపీ- చంద్ర‌బాబు
దివంగత అబ్దుల్ కలాం పుట్టిన రోజున ప్రతిభా అవార్డులు ప్రదానం చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో గతేడాది పది, ఇంటర్‌, డిగ్రీల్లో అత్యుత్తమ మార్కులు, గ్రేడ్‌ పాయింట్లు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో టెక్నాలజీని శాసించే శక్తి ఏపీకే ఉందన్నారు. ఏపీని ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news