దొంగల్లోనూ మంచోళ్లున్నారు.. మీరు గ్రేట్ బాసులూ..!

-

దొంగల్లోనూ మంచి దొంగ, చెడ్డ దొంగ అంటూ ఉంటారా? అనే డౌటనుమానం మీకు వచ్చిందా ఎప్పుడైనా? అదేం డౌటు.. దొంగ అంటేనే వాడు చెడ్డోడు. ఇక మంచి దొంగ ఏంది అని అంటారా? అయితే.. మిమ్మల్ని చెన్నై తీసుకెళ్లాల్సిందే. అక్కడ మంచి దొంగలు కూడా ఉన్నారోచ్. మీరు చెబితే నమ్మేటట్టు లేరు కాని ఓసారి చెన్నై వెళ్లొద్దాం పదండి..

మీకు పర్స్ ఉందా? ఉంటే అందులో ఏమేం ఉంటాయి చెప్పండి. ఆ.. ఏముంటాయి.. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డబ్బులు ఎట్సెట్రా ఉంటాయంటారా? అవును.. ఎవరి పర్సులో అయినా ఇంచు మించు ఇవే ఉంటాయి. మీ పర్స్ పోయిందనుకో.. ఏం చేస్తారు. అయ్యో.. డబ్బులతో పాటు విలువైన కార్డులు కూడా పోయాయే.. ఇప్పుడు వీటన్నింటినీ బ్లాక్ చేసి మళ్లీ కొత్తవి తీసుకోవాలా అని ఊసురుమంటారు కదా.

అందుకే.. పర్సులు కొట్టేసిన ఈ దొంగలు అందులోని డబ్బులను మాత్రం తీసుకుంటారు కానీ.. పర్సులోని కార్డుల జోలికి మాత్రం వెళ్లరు. వాటిని ఏం చక్కా పోస్ట్ బాక్స్‌లో వేస్తారు. నమ్మరా? మేం చెప్పేది నిజం బాబూ నిజం. గత ఆరు నెలల్లో చెన్నై కార్పొరేషన్ పరిధిలో దాదాపు 70 కేసులు ఇటువంటివే తగిలాయట. పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్లు పోస్ట్ బాక్స్‌లో వేసిన కార్డుల యజమానిని కనుక్కొని మరీ వాళ్లకు ఇచ్చి వస్తున్నారట. అయినా.. ఇదంతా పోస్టల్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఎందుకు చేయాలి.. అనే కదా మీకు వచ్చే మరో డౌట్. మనం మనుషులం బాస్. తొటి వారిని మనం కాకపోతే ఇంకెవ్వరు ఆదుకుంటారు.. అని బదులిస్తున్నారు పోస్టల్ సిబ్బంది. ఏదో మాకు చేతనైన సాయం మేం చేస్తున్నాం అని పోస్టల్ సిబ్బంది.. తమ ఖర్చుతోనే ఆ కార్డులను కార్డుదారులకు అందిస్తున్నారట. అది ఆ మంచి దొంగల స్టోరీ.

Read more RELATED
Recommended to you

Latest news