భారత ప్రధాని నరేంద్ర మోదీకి సియోల్ శాంతి పురస్కారం వరించింది. వివిధ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ.. అంతర్జాతీయ సహకారం, ఆర్థికాభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలకుగాను 2018 సంవత్సరానికి బహుమతిని అందుకోనున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
భారత్లో మోదీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలపై ప్రశంసలు జల్లు కురిపించింది. ధనిక, పేద ప్రజల మధ్య ఉన్న సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగేలా ఎంతో కృషి చేస్తున్నారని… అవినీతిని కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దుపై అవార్డు కమిటీ అభినందించింది. రెండేళ్లకు ఒకసారి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు.