వైజాగ్: ఇది కదా అసలు మజా అంటే. క్రికెట్‌లో ఉండే మజానే వేరప్పా. అందుకే క్రికెట్ అంటే చాలామంది జనాలకు పిచ్చి. అది ఇవాళ్టి భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌లో కొట్టొచ్చినట్టు కనిపించింది. నరాలు తెగే ఉత్కంఠ, అంతా ఊపిరి బిగపట్టుకొని మ్యాచ్‌ను చూశారు. ఎక్కడివాళ్లక్కడే ఆగిపోయి మరీ.. పచ్చిగా చెప్పాలంటే ఈ ప్రపంచాన్నే మరిచిపోయి మ్యాచ్‌ను తిలకించారు. కానీ.. మ్యాచ్ కాస్త టై అయింది. దీంతో ఇండియా క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా భేర్‌మన్నారు. పోనీలే.. మ్యాచ్ ఓడిపోలేదు కదా. ఎలాగూ ఇండియానే 1-0 ఆధిక్యంలో ఉంది కదా అని క్రికెట్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇది ఇవాళ వైజాగ్‌లో జరిగిన భారత్, వెస్టిండిస్ రెండో వన్డే మ్యాచ్ పరిస్థితి.
వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 322 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్‌కు నిర్ధేశించింది. ఇక.. ఇదే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను సాధించాడు. 10 వేల పరుగుల మైలురాయి, వెస్టిండీస్‌పై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రెండు రికార్డులను సాధించి భారత క్రికెట్ సత్తాను ప్రపంచానికి చాటాడు.
It's a tie in Vizag! What a match!#TeamIndia lead the 5 match ODI series 1-0#INDvWI pic.twitter.com/gwLYvu1DlQ
— BCCI (@BCCI) October 24, 2018
It's a tie in Vizag! What a match!
Shai Hope hits a four off the last ball to finish with a fantastic 123* and the scores are level! India remain 1-0 up in the series.#INDvWI scorecard ➡️ https://t.co/gVFbHbvkYh pic.twitter.com/mZ6w6h8Jnh
— ICC (@ICC) October 24, 2018
2nd ODI. It's all over! Match tied https://t.co/h33z2FvefA #IndvWI @Paytm
— BCCI (@BCCI) October 24, 2018