రూ.100 కోట్ల సీఎంఆర్ బియ్యం పక్కదారి..డిప్యూటీ సీఎం భట్టి సీరియస్!

-

సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. సీఎంఆర్ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ధాన్యం పక్కదారి విషయంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రూ.100 కోట్ల మేర సీఎంఆర్ ధాన్యంలో అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. ఇందుకు గల కారకులను కఠినంగా శిక్షిస్తామని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.

జిల్లాలో మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బియ్యాన్ని వెంటనే రాబడుతామన్నారు. కాతా, జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి బియ్యంగా అప్పజెప్పాలి.కానీ, కొందరు మిల్లర్లు సీఎంఆర్ అప్పగించకుండా పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, సివిల్ సప్లైస్ టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీల్లో మిల్లర్ల అక్రమదందాలు వెలుగుచూడటంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Read more RELATED
Recommended to you

Latest news