రైతులకు శుభవార్త…. ఇకపై పీఎం కిసాన్ అకౌంట్లో రూ. 9,000 జమ…?

-

2024 మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌తో రైతులను ఆకట్టుకునేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో సహా వారి సంక్షేమ పథకానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న ఈ మధ్యంతర బడ్జెట్‌లో పెద్ద ప్రకటనలు ఏమీ ఆశించనప్పటికీ, సర్కార్ ఈ సంవత్సరం పీఎం కిసాన్ పథకం చెల్లింపునకు మరో 50శాతం నిధులను పెంచొచ్చని పేర్కొంది. పీఎం కిసాన్ కింద ఏడాదికి చెల్లించే రూ.6వేల సాయాన్ని రూ.9 వేలకు పెంచొచ్చని ‘ది ఎకనామిక్స్ టైమ్స్’ తెలిపింది. గతేడాది పీఎం కిసాన్ స్కీమ్ కోసం రూ.60వేల కోట్లు కేటాయించింది. దీంతో ఏటా మూడుసార్లు రూ.3వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version