వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌.. త్వరలోనే..

-

తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంటుంది. వినియోగదారుల సౌలభ్యం కొరకు మరో అద్భుత ఫీచర్‌ను తీసుకురానుంది వాట్సాప్‌.. ఈ ఫీచర్ సహాయంతో గ్రూప్ అడ్మిన్లు గ్రూప్ సభ్యులు షేర్ చేసే మెసేజ్‌లను సులువుగా డిలీట్‌ చేయవచ్చు. గ్రూప్‌లో ఎవరైనా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్ సదరు మెసేజ్‌ను తొలగించే హక్కును కలిగించనుంది. దీంతో గ్రూప్ సభ్యులకు అడ్మిన్ తమ మెసేజ్‌ను డిలీట్ చేసినట్లు చాట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో తీసుకువచ్చేందుకు వాట్సాప్‌ కృషి చేస్తోంది. మరోవైపు వాట్సాప్ ఎట్టకేల‌కు రియాక్షన్స్ ఫీచ‌ర్‌ను యూజ‌ర్లకు అందుబాటులోకి తేనుంది. తొలుత యూజ‌ర్లు రియాక్షన్ మెసేజ్ పంప‌డానికి ఆరు ఏమోజీలు పొందొచ్చు. లైక్‌, ల‌వ్‌, లాప్‌, స‌ర్‌ప్రైజ్‌, శాడ్‌, థ్యాంక్స్ ఎమోజీలు ఈ జాబితాలో ఉన్నాయి. అన్ని ర‌కాల ఏమోజీలు వాడే అవకాశం భ‌విష్యత్‌లో రావొచ్చు. వాటిలో కొన్ని బీటా టెస్టింగ్‌కు వినియోగిస్తున్నారు. దీనికి అద‌నంగా యాప్‌లోని జిఫ్‌లు, స్టిక్కర్లు కూడా యూజ‌ర్లు వినియోగించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version